ఆంధ్రప్రదేశ్

  • ‘వైసీపీని ఓడించటమే బీసీల లక్ష్యం కావాలి’
    ‘వైసీపీని ఓడించటమే బీసీల లక్ష్యం కావాలి’

    ఏపీ ప్రభుత్వ సలహాదారుల్లో బీసీలు ఎంతమంది ఉన్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ‘బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పదవుల్లో బీసీలు ఉన్నా ఒక సామాజిక వర్గానిదే అధికారమని విమర్శించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై చర్చకు సిద్ధమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించటమే బీసీలందరి ఏకైక లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ

  • ‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు’
    ‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు’

    చంద్రబాబు పట్ల ఏపీ ప్రభుత్వ తీరు సరైంది కాదని మంత్రి తలసాని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నామని వ్యక్తిగత కక్షసాధింపులు సరికాదని పేర్కొన్నారు. తనకు రాజకీయ జీవితం ప్రసాదించింది ఎన్టీఆరే అని తెలిపారు. అంతేకాక అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.